జులై 10న రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్
– పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు
కామారెడ్డి, జులై 03 ( లోకంతీరు న్యూస్ ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం నిర్వహించిన విద్యార్థి సంఘాలు సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2026 జూలై 10న తెలంగాణ రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్* ను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
జూలై 10న జరుగు విద్యాసంస్థల బంద్* ను విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటువిద్యాసంస్థలు, ప్రజాస్వామికవాదులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో వామపక్ష విద్యార్థి సంఘ నాయకుల ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….
– తెలంగాణ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలల మూసివేతను విరమించుకోవాలి, ప్రభుత్వ విద్య వ్యవస్థను బలోపేతం చేయాలి.
– ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ సమగ్ర చట్టం రూపొందించాలి.
– పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కిం బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.
– విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి.
– ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థ ల ను మూసివేయాలి.
– విద్య రంగానికి అధిక నిధులు కేటాయించాలి.
– మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేసి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలి.ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి.
ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు , రాష్ట్ర కార్యదర్శి జి సురేష్, ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్, ఏఐఎస్ఎఫ్ కామారెడ్డి ఏరియా అధ్యక్ష కార్యదర్శులు శివ సంపత్,ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు నితిన్,ఏ ఐ ఎస్ బి జిల్లా నాయకులు నిఖిల్ గౌడ్ నాయకులు రోహిత్ పిడిఎస్యు జిల్లా నాయకులు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.