Take a fresh look at your lifestyle.

వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి….

0

వరుణ యాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

– లోకకళ్యాణార్థం యాగాలు నిర్వహించడం అభినందనీయం 

– వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

నిజామాబాద్ అర్బన్, ఆగష్టు 08 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన రైస్ మిల్ మరియు మర్చంట్ అసోసియేషన్, ఉమామహేశ్వర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ శతచండి సహిత రుద్ర వరుణయాగం మహా ఘట్టంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు వేదపండితులు సాదర స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా పడి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.

అనంతరం జరిగిన పూర్ణాహుతి ఆద్యంతం నయనానందకరంగా సాగింది.బ్రాహ్మణ పురోహితుల మంత్రోచ్ఛరణల నడుమ పూర్ణాహుతి ఆద్యంతం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దైవానుగ్రహంతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. లోకకల్యాణార్థం ఇంత గొప్పగా యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం అభినందనీయమన్న ఎమ్మెల్యే నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మాజి నరేష్, పొలసాని శ్రీనివాస్, అంబర్ సింగ్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.