Take a fresh look at your lifestyle.

నిజామాబాద్‌లో జనసేన బలోపేతం….

0

నిజామాబాద్‌లో జనసేన బలోపేతం

– మీసాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సమాయాత్త సమవేశం

​నిజామాబాద్ అర్బన్, ఆగష్టు 08 ( లోకంతీరు న్యూస్ ) : ​నిజామాబాద్‌లోని సుగుణ గార్డెన్స్‌లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల ముఖ్య రాజకీయ సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర నాయకుడు, మీసాల ఫౌండేషన్ ఛైర్మన్ మీసాల శ్రీనివాసరావు నాయకత్వంలో నిజామాబాద్, జహీరాబాద్ జిల్లాలకు చెందిన జనసైనికులు, వీరమహిళలు ఈ ప్రిపరేటరీ సమావేశానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా మీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తలను భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దడమే జనసేన పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు సమాజంలోని అన్ని వర్గాలను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల నుండి మారుమూల గ్రామాల వరకు పార్టీని విస్తరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రాంతీయంగా, జాతీయంగా పవన్ కళ్యాణ్ పెరుగుతున్న ప్రాబల్యంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో పరిశీలకులు శర్మ, మీడియా ఇన్‌చార్జ్ దుంపాటి శ్రీనివాస్‌లతో పాటు స్థానిక ముఖ్య నాయకులు శరత్, కారంపూరి శ్రీనివాస్, సాదుల రాజు, సాదుల నరేందర్, బింగి రవీందర్, బొజ్జ మహేష్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ పవన్ కళ్యాణ్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని వీరంతా ప్రతిజ్ఞ చేశారు.

Leave A Reply

Your email address will not be published.