Take a fresh look at your lifestyle.

నాళేశ్వర్‌లో గ్రామంలో ఘనంగా ఏడ్ల పోలాల అమావాస్య…..

0

నాళేశ్వర్‌లో గ్రామంలో ఘనంగా ఏడ్ల పోలాల అమావాస్య

నవీపేట్ , సెప్టెంబర్ 10 ( లోకంతీరు ) : మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో ఏడ్ల పోలాల అమావాస్య వేడుకలను రైతులు ఘనంగా నిర్వహించారు. రైతులకు అండగా నిలిచే ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి,పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు.ఈ సందర్భంగా రైతులు తమ ఎద్దులను రంగురంగుల వస్త్రాలతో,పూలతో అందంగా అలంకరించి డప్పు వాయిద్యాల నడుమ గ్రామంలో ఊరేగింపుగా వేళ్లి అనంతరం గ్రామంలోని హనుమాన్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, పంటలు బాగా పండాలని,పాడి పశువులు,ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.రైతు జీవితంలో ఎద్దుల పాత్ర ఎంతో కీలకమని, వ్యవసాయంలో తమకు సహకరించే పశువులను గౌరవించడం మన సంప్రదాయంలో భాగమని రైతులు తెలిపారు. ఈ వేడుకల్లో సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు,సర్పంచ్ ఆర్ముర్ లావణ్య,ఉప సర్పంచ్ శ్రీనివాస్ రైతులు లక్ష్మణ్నవిన్, సంజీవు ,గణేష్, లింగారెడ్డి, భూమయ్య,సురేష్,రాజు,శ్రీనివాస్,కిషాన్,క్రిష్ణా,ఊదయ్,ఆజయ్,హరిష్,పిరాజీ,గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.