Take a fresh look at your lifestyle.

సేవా దృక్పథం తో మెలగాలి……

0

సేవా దృక్పథం తో మెలగాలి

– అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, అక్టోబర్ 25 ( లోకంతీరు న్యూస్ ) : ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. శ్రీ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కిసాన్ ఫ్యాషన్ మాల్ లో ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టు చైర్మన్, ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ… సేవా కార్యక్రమాలు చేయడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంతమేర సేవా కార్యక్రమాలకు ఖర్చు చేయాలన్నారు. పేదలను ఆదుకొని అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. యువత వారాంతంలో హంగు ఆర్భాటాలకు పోకుండా తోచిన విధంగా సేవ చేయాలని పిలుపునిచ్చారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో పేరు ప్రతిష్టల తో పాటు నలుగురికి సాయం చేశామన్న తృప్తి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ధన్ పాల్ ప్రణయ్ కుమార్, డాక్టర్ వినయ్ కుమార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.