కుర్నాపల్లి గ్రామంలో పట్టపగలే దొంగతనం
ఎడపల్లి, సెప్టెంబర్ 18 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో పట్టపగలే చోరీ జరిగిన ఘటన మండలంలో కలకాలం రేపింది. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. కుర్నపల్లి గ్రామానికి చెందిన తులసి గారి నరేందర్ రెడ్డి ఇంట్లో చోరీకీ పాల్పడ్డారు. బాధితులు సమీప బంధువుల ఇంటికి వెళ్లడంతో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారు. బీరువాని పగలగొట్టి అందులో ఉన్న రెండు తులాల బంగారంతో పాటు నగదు 30 వేల రూపాయలను దొంగిలించారు. బీరువాలోని చీరల కింద సుమారు 32 తులాల బంగారం నగలు ఉన్నప్పటికీ అవి దొంగలకు కనిపించ లేకపోయాయని బాధితులు పోలీసులకు తెలిపారు. వెంటనే బోధన్ ఎసిపి శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు క్లూస్ టీమ్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటా హుటిన వారు కుర్నపల్లికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై ఇంటి యజమానులతో వారు మాట్లాడారు. చోరీ జరిగిన ప్రదేశాలను క్షుణగా పరిశీలన చేశారు. ఈ విషయమై బోధన్ ఎసిపి శ్రీనివాస్ మాట్లాడారు. చివరికి పాల్పడ్డా వారిని పట్టుకునేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపతామని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెంట బోధన్ రూరల్ సీఐ విజయబాబు, ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, స్థానిక కుర్నపల్లి గ్రామస్తులు తదితరులు ఉన్నారు.