ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డిని కలిసిన గ్రామ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం
– నూతనంగా ఎన్నుకోబడిన సందర్భంగా భేటీ
– గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచన

నిజామాబాద్ రూరల్ , ఆగష్టు 09 ( లోకంతీరు న్యూస్ ) : గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. డిచ్ పల్లి మండలం డిచ్ పల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గం ఇటీవల ఎన్నిక కాగా ..స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు సుదర్శన్ నేతృత్వంలో ఆదివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు దాసరి అశోక్, సూర శ్యామ్,లను , శాలువాతో సత్కరించి అభినందించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, గ్రామ కాగ్రెస్ పార్టీ శాఖ కార్యవర్గం జితేందర్ , సుధాకర్, మేరు లింగం, కిషన్ రెడ్డి, నర్సారెడ్డి,పెద్ద సాయిలు,నర్సయ్య, సుమన్,నవీన్, రాజారెడ్డి, లింగం తదితరులు పాల్గొన్నారు.