క్రిమినల్ కేసులు లావాదేవీలలో అవకతవకలు ఉంటే ఉపేక్షించేది లేదు
– ఏపిఓ సువర్ణ

సిరికొండ, సెప్టెంబర్ 21( లోకంతీరు ) : స్వయం సహాయక సంఘాలలో, ఎటువంటి అవినీతి జరిగిన ,కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో క్రిమినల్ కేసులు ఉన్న ఉపేక్షించేది లేదని సిరికొండ ఏపీఎం సువర్ణ వెల్లడించారు. సోమవారం లోకంతీరు తో మాట్లాడుతూ మండల కేంద్రంలోని కొన్ని సంఘాల లావాదేవీలు సరిగ్గా నిర్వ హించడం లేదని నా దృష్టికి వచ్చిందని వాటి పై త్వరలో సంఘాల అభివృద్ధి కోసం బకాయి ఉన్న సొమ్మును త్వరలో రికవరీ చేస్తామన్నారు. అలాగే స్త్రీ నిది డబ్బులు కూడా త్వరలోనే రికవరీ చేయాలని క్రింది స్థాయి అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.అధికారులు వ్యక్తిగత కక్ష్యలకు పోకుండా ప్రభుత్వ ఆదేశానుసారం పని చేయాలని అన్నారు.