పదిహేను వేల లంచం తీసుకుంటూ…..
ఏసీబీకి చిక్కిన ఇద్దరు మున్సిపల్ అధికారులు…

నిజామాబాద్, సెప్టెంబర్ 21( లోకంతీరు ) : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జూనియర్ అకౌంటెంట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి లంచం తీసుకుంటున్న ఇద్దరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అకౌంట్స్ సెక్షన్‌లో జూనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అశోక్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కిరణ్ రూ.15 వేల నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం.లంచం డిమాండ్ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రూ.15 వేల నగదు స్వీకరిస్తున్న సమయంలో ఇద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. నిందితులపై తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.