జిల్లా ఇంచార్జి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్


నిజామాబాద్, ఆగస్టు 19 ( లోకంతీరు) : నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇంచార్జి మంత్రి డి.అనసూయ సీతక్కను కలెక్టర్ భవేష్ మిశ్రా బుధవారం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీలకు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. వారితో కొద్దిసేపు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ తదితరులు ఉన్నారు.