Take a fresh look at your lifestyle.

పార్టీ బలోపేతమే లక్ష్యం..

0

పార్టీ బలోపేతమే లక్ష్యం..

భవిష్యత్ కార్యాచరణపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పీఏసి సమావేశం..


నిజామాబాద్, ఆగస్టు 19 ( లోకంతీరు ) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసి) సమావేశం బుధవారం నిజామాబాద్‌లో జరిగింది.పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం అన్నారు.కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని అన్నారు. పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ప్రతి పోలింగ్ బూత్‌లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని, బూత్ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కార్యక్రమాలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అన్నారు.ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్న ప్రజలను పార్టీతో అనుసంధానం చేయాలని సూచించారు.నాయకుల మధ్య సమన్వయం, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచాలని అన్నారు.ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.అలాగే పార్టీ అనుబంధ సంఘాలు, యువజన, మహిళా, విద్యార్థి, కార్మిక, మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాలను మరింత క్రియాశీలం చేయాలని అన్నారు. కొత్తగా పార్టీకి వచ్చే యువతను ప్రోత్సహిస్తూ వారికి సంస్థాగత బాధ్యతలు అప్పగించాలని సూచించారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…..

కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.బూత్ స్థాయి కమిటీలను మరింత క్రియాశీలం చేసి ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని అన్నారు. పార్టీ కార్యక్రమాలను క్రమబద్ధంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. …

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నాయకులు ముందుండాలని తెలిపారు.ఈ సమావేశంలో నిజామాబాద్ మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యే మదన్ మోహన్, సునీల్ రెడ్డి, వినయ్ రెడ్డి, యూసుఫ్ అలీ, కాసుల బాలరాజ్, అరికెల నరసరెడ్డి, ఆకుల లలిత, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్, కార్పొరేషన్ చైర్మన్లు మనాల మోహన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, కేశ వేణు, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.