Take a fresh look at your lifestyle.

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలి……

0

సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు

– ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు మండపాలకు సహకారం

నిజామాబాద్, సెప్టెంబర్ 12 ( లోకంతీరు న్యూస్ ) :  సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.  ధన్ పాల్ లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రెండో రోజు శనివారం నగరంలోని మార్వాడిగల్లి లో గల కార్యాలయంలో వినాయక ఉత్సవ నిర్వాహకులకు చెందాలను రాశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రతి సంవత్సరం తమ ట్రస్టు ద్వారా సహకారం అందిస్తామని గత సంవత్సరం 725 మండపాలకు అందించినట్లు పేర్కొన్నారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఈ ఏడాది కూడా సుమారు 800 మండపాలకు తన వంతు సహకారం ఉంటుందన్నారు. వినాయకుడు కేవలం ఒక పండుగకు సంబంధించిన దేవుడు కాదని సంస్కృతి సనాతన ధర్మం ఐక్యతకు ప్రతీక అని చెప్పారు.వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగి శుభాలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరు తమ మండపాల ముందు బాలగంగాధర్ తిలక్ చిత్రపటాన్ని ఉంచాలని సూచించారు. ఉత్సవాలతో అందరూ ఒకచోట చేరి సామూహిక ఐక్యతను పెంపొందించుకొనే అవకాశం ఉంటుందన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కిసాన్ షాపింగ్ మాల్ వద్ద మట్టి వినాయకుల పంపిణీ ఉంటుందన్నారు. కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.