ప్రకృతి వ్యవసాయంపై మార్గదర్శనం
ఎడపల్లి, అక్టోబర్ 26 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలోని ఆదర్శ రైతు కరటూరి పాపారావు శ్రీ సూర్యోదయ వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం పంచమ వినియోగదారుల ప్రకృతి ప్రేమికుల సదస్సు నిర్వహించారు ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యకరమైన ఆహార విధానాలు పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతపై చర్చించారు ఆదర్శ రైతు పాపారావు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు పురుగు మందులు లేని ఆహారాన్ని పండించడం ఎంత ముఖ్యమో దానిని వినియోగదారులు గుర్తించాలని కోరారు