Take a fresh look at your lifestyle.

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం !

0

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల ఉక్కుపాదం !

మద్యం తాగి డ్రైవింగ్‌ చేస్తున్నారా ? జాగ్రత్త !

  • డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసుల్లో భారీ జరిమానాలు

  • నిజామాబాద్‌లో డ్రంక్ డ్రైవ్‌పై పోలీసుల నిఘా

  • 1784 డ్రంక్ డ్రైవ్ కేసులు.. రూ.1.45 కోట్ల జరిమానా

  • రహదారి భద్రతపై పోలీసుల కఠిన వైఖరి

  • 124 మందికి వారం రోజులు జైలు శిక్ష 

  • పోలీస్ కమిషనర్ వెల్లడి

నిజామాబాద్, సెప్టెంబర్ 12 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పి.ఎస్ లలో గడిచిన 6 వారాలలో డ్రంకన్ డ్రైవ్ లో 1784 మంది పట్టు బడగా వారిని నిజామాబాదు , బోధన్ మరియు అర్మూర్ కోర్టులలో వారిని హాజరు పర్చగా ఇందులో 124 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని మిగిలిన వారికీ 1 కోటి 45,20,000/- జరిమానా విధించనైనది. కమిషనరేట్ పరిధిలో చేసిన తనిఖీలలో అధిక మొత్తములో త్రాగి వాహనములు నడిపి పోలీస్ వారికి పట్టుబడటం జరుగుచున్నది, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ డివిజన్ మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ సమీపాలలో వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలలో వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఇందులో భాగముగా తేది:02-08-2026 నుండి తేది: 12-09-2026 వరకు వాహన తనిఖీలు నిర్వహించగా ఇందులో మొత్తం 1784 కేసుల నమోదు చేయడం జరిగింది.

నిజామాబాదు పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య , ఐ.పి.ఎస్ కింది గమనికలు తెలియజేయడం జరిగింది.

1) ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపరాదు

2) వాహనాదారులు వాహనానికిసంబంధించినటువంటి పత్రములు సక్రమముగా తమ వద్ద ఉంచుకోగలరు.

3) డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేయబడును

4) మద్యం త్రాగి వాహనం నడిపి అనుకోని రోడ్ ప్రమాదం జరిగినట్లయితే ఇన్సూరెన్సు లభించదు.

5) మైనర్లు తాగి వాహనం నడిపి పోలీస్ వారికి దొరికినటైతే మైనర్ మరియు వెహికల్ ఓనర్ పైన ఛార్జ్ షీట్ నమోదు చేయబడును అలాగే జైలు శిక్ష విధించే అవకాశం కలదు.

6) ఒక సారి కంటే ఎక్కువ సార్లు పట్టుబడినట్లయితే జైలు శిక్ష విధించబడును

7) మోటర్ వెహికల్ యాక్ట్ 1989 (చట్టం సవరణ – 2019) అమలులో ఉన్నందున డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొదటిసారి పట్టుబడినట్లయితే 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా తో పాటు జైలు శిక్ష విధించబడును. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండోసారి పట్టుబడినట్లైతే 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష లేదా జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును.

Leave A Reply

Your email address will not be published.