దేవునిపల్లి పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 06 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కౌన్సిలర్ కాసర్ల గోదావరి స్వామి హాజరై మాట్లాడుతూ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పాఠశాల గంగా కిషన్, ఉపాధ్యాయులు జంగం శ్రీశైలం, శ్రీనివాస్, రమేష్, రాజు, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.