మాజీ సర్పంచులు అరెస్ట్

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , నవంబర్ 04 ( లోకంతీరు ) : బాల్కొండ మండలం కేంద్రంలోని సోమవారం ఉదయం నుండి మండల ముగ్గురు సర్పంచులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం ఐదు సంవత్సరములు అహర్నిశలు కృషిచేసి, గ్రామంలో చేసిన పనుల యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించమని కోరితే తప్పేముంది అని అంటారు. ఈరోజు ఉదయం నాలుగు గంటల నుంచి మండలంలోని అందరు సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సరి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.. పది నెలల కింద అప్పులు తెచ్చి పనులు చేసి వాటికి బిల్లు అడిగితే అక్రమంగా అరెస్టు చేసుడు సిగ్గుచేటు అని ఉన్నారు. సర్పంచులకు బిల్లు చెల్లించడానికి డబ్బులు లేవు కానీ లక్షన్నర కోట్లతో మూసి ప్రాజెక్ట్ చేపట్టడానికి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయి అని అంటున్నారు.బిల్లులు చెల్లింపు చేయకుండా సర్పంచులను ప్రభుత్వము వేధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సంఘటనను బాల్కొండ సర్పంచులు తీవ్రంగా ఖండించారు.