తప్పు ఎవరిది…?
– దారి తప్పుతున్న యువత..!

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 08 (లోకంతీరు) : నేటి సమాజంలో యువత పెడదారిన పడుతుంది. దీనికి అనేక కారణాలు అని కూడా చెప్పవచ్చు అదేవిధంగా టెన్త్ క్లాస్ దాటడం లేదు.. సిగరేట్లు, మద్యానికి బానిసవుతున్నారు.. గంజాయికి అలవాటు పడి నేటి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇన్ స్ట్రాలో తమ విచ్చలవిడితనంను ప్రదర్శిస్తున్నారు. మద్యం తాగుతూ, సిగరేట్లు తాగుతూ, మారణాయుధాలు ప్రదర్శిస్తూ,రీల్స్ చేయడం పారిపాటై పోయింది. చదువుకునే వయస్సులో చెడు వ్యసనాలకు అలవాటు పడి తమ జీవితాలు నాశనం చేసుకుంటున్న నేటి యువత విషయంలో తమ పిల్లలపై పర్యవేక్షణ లోపం వహిస్తున్న తల్లిదండ్రులదా..? తప్పు, విద్యా బుద్దులు నేర్పిస్తున్న గురువులదా..? లేక నడి రోడ్లపై బరితెగిస్తూ,ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని కంట్రోల్ చేయడంలో విఫలమవుతున్న పోలీస్ శాఖదా..? గల్లి గల్లిల్లో ప్రతి సందుల్లోకి ప్రవేశం చేసిన గంజాయి, డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వానిదా..?
ఏది ఏమైన నేటి భావి భారత పౌరులు దారితప్పుతున్నారు.. తల్లిదండ్రలు పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలకు డబ్బు విలువ తెలియనివ్వకుండ అడిగిదల్ల కొనివ్వడం, గారాబం చేయడం, చూసి చూడనట్లు విడిచిపెట్టడంతో భౌవిష్యత్ లో జీవితంలో దేనికి పనికిరాకుండా పోయి ఒక సంఘ విద్రోహశక్తిగానో లేక చేయరాని పనులు చేసి జైలు జీవితం అనుభవించడమో .. జరుగుతుంది.తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త మీ పిల్లలపై ఒక కన్ను వేసిపెట్టండి.దారి తప్పకుండ చూసుకొండి దారి తప్పక ముందే జాగ్రత్త పడితే మంచిది జరగాల్సింది జరిగిపోయాక బాధపడితే లాభం లేదు పోలీసులు కూడా ఒక స్థాయి వరకే ఊరుకుంటారు అతి చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇటువంటి వాటిపై కాస్తా సిరియస్ గా ఉంటే యువత భౌవిష్యత్ ను కాపాడిన వారవుతారు..,! తల్లిదండ్రలను ఠాణాలకు పిలిపించి కౌన్సిలింగ్ లు కూడా ఇవ్వాలి. మైనర్లు కూడా ఎక్కువగా ఇలా చేస్తున్నారు కాబట్టి మొదట కేసులు అనే పదం కాకుండా కౌన్సిలింగ్ తో భయం పెట్టి వినకపోతే కేసులు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని సూచన మాత్రమే