లైంగిక దాడిలో పొక్సో కేసులో నేరస్తునికి 7 సం. లు జైలు శిక్ష

కామారెడ్డి జిల్లా , ఆగస్టు 08 ( లోకంతీరు ) : బాలికపై లైంగిక దాడి పోక్సో కేసు లో నేరస్తుడైన గుడ్డేల రాములు అనే వ్యక్తికి 07 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం లింగంపేట మండలానికి చెందిన 08 ఏళ్ల బాలిక 2018 జులై 07 న పాఠశాల నుంచి ఇంటికి వచ్చి ఇంటి బయట అడుకుంటున్న చిన్నారిపై లింగంపేట్ మండలం, శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన గుడ్డేల రాములు బాధిత బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో అమె ఏడుస్తూ తీవ్ర భయాందోళనకు గురైంది. తల్లితండ్రులు రోజువారీ కూలీ పనుల వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పడంతో 2018 జులై 08 న స్ధానిక లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయ మూర్తి నిందితులపై మోపిన నేరం రుజువు అయిందని 07 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి సీఐ సుధాకర్, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి, పోలీసు తరపున వాదనలు వినిపించిన అదనపు ప్రాసిక్యూటర్ శేషు కోర్టు లో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత సిఐ, రవీంద్ర నాయక్, ప్రస్తుత ఎస్ఐ చైతన్య రెడ్డి, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి. మురళి, కోర్ట్ హెడ్ కానిస్టేబుల్ మనోహర్ రావు, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.