Take a fresh look at your lifestyle.

నిజాంసాగర్ ఉపకాలువలో పూడిక తీత పనులు….

0

నిజాంసాగర్ ఉపకాలువలో పూడిక తీత పనులు.

బాన్సువాడ/కోటగిరి , ఫిబ్రవరి 18 ( లోకంతీరు ) :  బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలం కొత్తపల్లి క్యాంప్ నుంచి నిజాంసాగర్ 27 డిస్ట్రిబ్యూటర్ కాలువ అలాగే పోతంగల్ మండలంలోని 28/1 కాలువలను బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సహకారంతో పూడికతీత పనులను ఆదివారం ప్రారంభించారు. నిజాంసాగర్ ప్రధాన కాలువ నుండి చివరి ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ఉప కాలువలు పూడికతో నిండి రైతులకు సకాలంలో నీరు అందక కొన్ని సందర్భాలలో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి.ఈ విషయాన్ని గమనించిన ఏనుగు రవీందర్ రెడ్డి ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి నిజాంసాగర్ ఉప కాల్వల పూడికతీత పనులకు నిధులను మంజూరు చేయించి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా నిజాం సాగర్ చివరి ఆయకట్టు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏనుగు రవీందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి సెక్రెటరీ కొండా రెడ్డి,వార్డ్ మెంబర్ రమణా రెడ్డి,దేవుని గుట్ట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కొర్ర జైపాల్, కేతావత్ రవి,కోటి రెడ్డి, సుబ్బారెడ్డి,నాగిరెడ్డి,కృష్ణారెడ్డి,గ్రామ పెద్దలు పాపిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.