Take a fresh look at your lifestyle.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం….

0

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం

– మండల విద్యాధికారి జి మైసాజీ

ముధోల్, అక్టోబర్ 19 ( లోకంతీరు ) : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామని మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. శనివారం మండల కేంద్రమైన బాసరలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఉర్దూ)లో పోషకుల-ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇప్పటికే ఉపాధ్యాయ కొరతను అధిగమించేందుకు మండలానికి 14 మంది నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను కేటాయించడం జరిగిందన్నారు. వారు విధుల్లో సైతం చేరారని పేర్కొన్నారు. పోషకులు సైతం తమ వంతు బాధ్యతగా సలహాలు సూచనలు అందిస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం చే విద్యా బోధన చేయడంతో పాటు మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల నుండి ఎందరో మంది విద్యార్థులు అత్యున్నత స్థానాలకు చేరుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోషకులు, తదితరులు, పాల్గొన్నారు.*

Leave A Reply

Your email address will not be published.