Take a fresh look at your lifestyle.

మహిళకు గుండె ఆపరేషన్ చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసా….

0

మహిళకు గుండె ఆపరేషన్ చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసా

– 1లక్ష 25 వేల రూపాయల ఎల్వోసి అందజేత

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, అక్టోబర్ 23( లోకంతీరు ) : భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ఎల్.గంగామణి హార్ట్ సర్జరీ అవసరమై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు ₹1.25 లక్షల రూపాయల ఎల్వొసి మంజూరు చేయించి ఎల్ ఓ సి కాపీ ని వారి కుటుంబ సభ్యులకు ఈరోజు హైదరాబాద్ లో అందజేశారు.

 

నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు ₹1 లక్ష 25 వేలు రూపాయల ఎల్ఓసి మంజూరు చేశారని

ప్రశాంత్ రెడ్డి మేలు మర్చి పోలేమని జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజి మంత్రి,ఎమ్మెల్యే వేములకు కృతజ్ఞతలు తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.