రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు పేరు నమోదు చేసుకోవాలి
– ఎడపల్లి తాసిల్దార్ దత్తాద్రి
ఎడపల్లి, సెప్టెంబర్ 19 ( లోకంతీరు ) : త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్తగా ఓటర్లను ఎలా నమోదు చేసుకోవాలో తెలుపుతూ శుక్రవారం ఎడపల్లి తాహసిల్దార్ కార్యాలయంలో బూత్ లెవెల్ స్థాయి (బిఎల్ఓ) సిబ్బందికిశిక్షణ ఇచ్చారు. మండలంలోని బిఎల్ఓలు గ్రామ, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ దత్తాద్రి మాట్లాడుతూ.స్థానిక సంస్థల ఎన్నికలకు గాను ను 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. కొత్తగా ఓటరు నమోదులో ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదని సూచించారు. నమోదు ప్రక్రియలో, లేదా ఓటరు తొలగింపులో ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకొని పనిచేయాలని సూచించారు. ఓటర్ నమోదు చాలా కీలకమన్నారు. ప్రస్తుతం బెలవల దగ్గర ఉన్న ఓటర్ జాబితాలో ఉన్న వారి పేర్లను పరిశీల చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ఏమైనా తప్పుగా ఉంటే సవరణ చేసుకునేందుకు అధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానిక సంస్థలు త్వరలో రానున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బిఎల్ఓ లపై అధికారులు ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో గ్రామపంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ సిబ్బంది బిఎల్వోలు అంకితభావంతో పనిచేస్తూ ఓటర్ నమోదు ప్రక్రియను క్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ కార్యక్రమంలో ఉపతాసిల్దార్ అనూష, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయప్రకాష్ నారాయణ, కార్యాలయ సిబ్బంది బి ఎల్ ఓ ల , గ్రామపంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.