Take a fresh look at your lifestyle.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం….

0

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం 

ఎల్లారెడ్డి, అక్టోబర్ 25 ( లోకంతీరు ) : ఎల్లారెడ్డి మండల పరిధిలోని బిక్కనూర్ గ్రామానికి చెందిన రహీమా బేగం ఇల్లు కూలిపోవడంతో విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కూలిపోయిన ఇల్లును పరిశీలించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయంతో పాటు డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం బిక్కనూర్ గ్రామానికి చెందిన కురుమ గోపాల్ గత రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని కురుమ గోపాల్ కు ఆర్థిక సాయం అందజేశారు.అయిన వెంట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మహేష్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు వాసవి గౌడ్, సీనియర్ నాయకులు సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.