అంగన్వాడి ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలి

ఎడపల్లి, నవంబర్ 12 ( లోకంతీరు ) : ఎడపల్లి మండల ఐసిడిఎస్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడి ఉపాధ్యాయుల పనితీరు పట్ల ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్టు పరిధిలోని 12 మంది సూపర్వైర్లు ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అంగన్వాడి ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. అంగన్వాడి కేంద్రానికి సంబంధించిన రికార్డులను తనిఖీలను నిర్వహించారు. అలాగే ప్రతిరోజు కేంద్రానికి హాజరవుతున్న చిన్నారి బాల బాలికల ఆన్లైన్, సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు కూడా ఆన్లైన్తో టాలీ అవుతుందా లేదా అనే అంశంపై పరిశీలన జరిపారు, రెండు రోజుల పాటు ఈ వర్క్ షాప్ కొనసాగగా బుధవారంతో ముగిసినట్లు ఐసిడిఎస్ ఎడపల్లి మండల పర్యవేక్షకురాలు సావిత్రి తెలిపారు. బుధవారం రోజున ఎడపల్లి లోని మండల విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్టు పరిధిలో గల12 మంది సూపర్వైజర్లతో పాటు అంగన్వాడి ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐసిడిఎస్ బోధన్ ప్రాజెక్ట్ సిడిపిఓ పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రంలో ఆన్లైన్ సిస్టం ఉన్నందున బాల బాలికల బరువులు ఎత్తులు కొలతలు ఆరోగ్య విషయాలు ప్రతి అంగన్వాడికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటిది ప్రతి అంగనవాడి టీచర్ ఆన్లైన్ చేయడం హర్షినియమన్నారు. 12 మంది సూపర్వైజర్లు ఎడపల్లి మండలంలోని ప్రతి అంగన్వాడి కేంద్రంలో రెండు రోజుల పాటు ఆన్లైన్ టాలీ అవుతుందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.కేంద్రంలో ఉన్న రికార్డులను బాలికల బాలుర హాజరు శాతాన్ని కూడా ఆన్లైన్లో నమోదు చేసి ఉండడం పట్ల, అంగన్వాడి కేంద్రానికి సంబంధించిన రికార్డులు కూడా ఆన్లైన్టాలీ తెలుసుకున్నారు.సూపర్వైజర్లు పర్యవేక్షించిన అంగన్వాడి కేంద్రాల పనితీరును సిడిపిఓ పద్మకు వివరించారు. అనంతరం సిడిపిఓ పద్మ మాట్లాడుతూ అంగన్వాడి ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు. సమయపాలన పాటించి స్థానిక గ్రామస్తుల అధికారుల మన్నలను పొందాలన్నారు. చిన్నారి బాల బాలికలకు చదువు,ఆట పాటలతో పాటు క్రీడ పోటీలను నిర్వహించాలన్నారు. పౌష్టిక ఆహారాన్ని తప్పనిసరిగా అందించాలని ఆమె సూచించారు. సూపర్వైజర్లు రెండు రోజుల పాటు చేసిన ఆన్లైన్ సర్వే సంతృత్కరంగా ఉందని వారిని అభినందించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ ఎడపల్లి మండల పర్యవేక్షకురాలు సావిత్రి, బోధన్ డివిజన్ ప్రాజెక్టు పరిధిలోని ఐసిడిఎస్ పర్యవేక్షకులు నందిని, రాధిక, కొమరవ్వ, సుమలత,వెంకటరమణ శ్రీలత, గోపి లక్ష్మి, గంగమణి ,సౌజన్య,గంగావేణి లతోపాటు అంగన్వాడి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.