నేటి బాలలే రేపటి శాస్త్రవేత్తలు
– ఫ్యూచర్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రవీణ్

ముధోల్, డిసెంబర్ 22 ( లోకంతీరు ) : నిర్మల్ జిల్లా ముధోల్ మండలానికి చెందిన ఎడ్మిడ్ లోని ఫ్యూచర్ కాన్సెప్ట్ పాఠశాలలో శనివారం శనివారం శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా పాఠశాలలో గణిత దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా మారి దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. జీవితంలో గణితం లేనిదే అడుగైనా ముందుకు సాగని ఈ రోజుల్లో గణితం పట్ల మక్కువ ఉండాలని గణితాన్ని కష్టంగా భావించకుండా ఇష్టంగా చదివి పాఠశాలకు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలని పేర్కొన్నారు. గణితం జీవితంలో భాగస్వామ్యమై ఉందని ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు తమ ప్రాజెక్టులతొ.ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు ఉపన్యాసాలు, పాటల పోటీలలో పాల్గొని బహుమతులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,ఉపాధ్యాయునిలు, విద్యార్థునిలు, విద్యార్థులు, పోషకులు, తదితరులు పాల్గొన్నారు.