Take a fresh look at your lifestyle.

వివేకానందను తీర్చి దిద్దింది రామ కృష్ణ పరమహంస దంపతులే….

0

వివేకానందను తీర్చి దిద్దింది రామ కృష్ణ పరమహంస దంపతులే 

నిజామాబాద్ అర్బన్, డిసెంబర్ 22(లోకంతీరు ) : కలకత్తాలోని రామకృష్ణ మఠంలో రామ కృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన శిష్యుడైన “నరేంద్రుడిని వివేకానందుని”గా తీర్చి దిద్దిన ఘనత రామకృష్ణ పరమహంస- అయన సతీమణి శారదాదేవి మాతాదేనని శబ్ద తరంగిణి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రభుత్వ గిరిరాజ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ సేర్ల దయానంద్ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస సతీమణి శారదదేవి మాతా 172 వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం నగరంలోని సరస్వతి నగర్ రోడ్ నెంబర్ -4 లో ఆమె జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ, వివేకానందునిని ఆదర్శమార్గంలో నడిపించి హిందూ మతం గొప్పతనాన్ని వి దేశాలలో చాటి చెప్పే విధంగా తీర్చిదిద్దిన మహోన్నతులు రామకృష్ణ పరమహంస -శారదాదేవి మాతాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్బంగా గీతా భవన్ కోశాధికారి, పోటా పోటీగా జరిగిన బాపూజీ వచనాలయం ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా అత్యాధిక ఓట్లు సాధించిన ఆరెట్టి లక్ష్మి నారాయణను “ఆదర్శ దాంపత్యం” గ్రంథం బుక్ ను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యెర్ర సూర్యనారాయణ గుప్తా, సేర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.