నవోదయ విద్యాలయంలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు..?
– నలుగురు ఉపాధ్యాయులపై ఫోక్స్ చట్టం కేసు నమోదు
–వివరాలు వెల్లడించే హక్కు లేదు….?
– ఎస్సై శివకుమార్ వివరణ

ఉమ్మడి నిజామాబాద్, జనవరి 05 ( లోకంతీరు ) : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో అభం శుభం తెలియని విద్యార్థులకు విద్య నేర్పించడానికి తల్లిదండ్రులు కొండంత నమ్మకంతో చదువుకోవడానికి పాఠశాలలకు పంపిస్తే, తల్లిదండ్రి తర్వాత చెప్పుకొని మరో పేరు గురువు అలాంటి విద్యార్థులు చెప్పే గురువులు ఇలాంటీ ఘటనలకు పాల్పడుతున్న వైనం. ఇలాంటి ఘటనలు ఇలాగే కొనసాగితే తల్లిదండ్రులలో ఆందోళన పెరిగి ఆడపిల్లగా జన్మించినందుకు చదువులు మానిపించే అవకాశాలు లేకపోలేవు. ఇలాంటి దుర్ఘటన మరోసారి జరక్కుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డ నలుగురు ఉపాధ్యాయులపై ఫోక్స్ చట్టం కేసు నమోదు అయింది. ఈ విషయం గురుంచి కొందరు రిపోర్టర్ లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ ను వివరణ అడగగా, విద్యార్థుల పై లైంగిక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవం, నలుగురు ఉపాధ్యాయుల పై ఫోక్స్ చట్టం కేసు నమోదు చేసింది వాస్తవం. కానీ ఎప్పుడూ సంఘటన జరిగింది, ఉపాధ్యాయులు ఎవరు? అన్నది తాము మీడియాకు వెల్లడించే హక్కు లేదు అంటూ మాట దాట వేశారు. ఇందులో ఆంతర్యం ఏమిటో.?