నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ఎడపల్లి, నవంబర్ 15 ( లోకంతీరు ) : బోధన్ డివిజన్ లోనీ బోధన్ రూరల్ ఎడపల్లి మండలం రెంజల్ మండలం లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డివిజన్ ఏడి నాగేష్ కుమార్ తెలిపారు బోధన్ రూరల్ లోని కల్దుర్కి. సంగెం. రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి ఎడపల్లి మండలంలోని తనకలన్ లో 33/11కేవీ విద్యుత్ ఉప కేంద్రాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుండి ఐదు గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఏడి స్పష్టం చేశారు.