Take a fresh look at your lifestyle.

కల్లూర్లో ఉచిత పశు వైద్య శిబిరం.

0

కల్లూర్లో ఉచిత పశు వైద్య శిబిరం.

 

బాన్సువాడ/కోటగిరి, జనవరి 27 ( లోకం తీరు ) :– ఉమ్మడి కోటగిరి మండలం పశు వైద్యశాల ఆధ్వర్యంలో కల్లూరు గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు.ఈ పశు వైద్య శిబిరాన్ని సర్పంచ్ వొల్లె లక్ష్మీ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 12 పశువులకు గర్భ నిర్దారణ,10 పశువులకు గర్భకోశ చికిత్సలు,35 పశువులకు సాధారణ చికిత్సలు,40 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ రాంరెడ్డి, పశు వైద్యులు డా.సురేష్ కుమార్,జూనియర్ డాక్టర్లు రాజేందర్,ప్రకాష్,అభిషేక్, సిబ్బంది మంజుల,సుధీర్ గౌడ్,గోపాల మిత్రులు రియాజ్,సాయిలు,నగేశ్,తుకారం,నాయకులు లింగప్ప, వెంకట్ రెడ్డి,పశువుల పెంపకందార్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.