Take a fresh look at your lifestyle.

చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు…..

0

చైనా మాంజా షాప్ ల పై టాస్క్ ఫోర్స్ టీమ్ ముమ్మర దాడులు

నిజామాబాద్, జనవరి 07 ( లోకంతీరు ) :  నిజామాబాద్ ఇంచార్జ్ పోలీస్ కమీషనర్ సింధు శర్మ  ఐ.పి. ఎస్  ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు సిసిఎస్ సిబ్బంది నిజామాబాద్ టౌన్ 2 పోలీస్ స్టేషన్ పరిధిలో గల పతంగుల షాపులపై సోదా చేసి 15 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకోనైనది. వాటి విలువ సుమారు 15 వేల రూపాయలు గుర్తించారు . అట్టి రెండు పతంగుల షాపు యజమానులు యం.డి అర్షఫ్ (43), యం.డి.హైమద్ ( 35 ) లను ఇద్దరినీ మరియు స్వాధీనపరుచుకున్న 15 చైనా మాంజా బాబిన్లను తదుపరి చర్య నిమిత్తము టౌన్ 2 ఎస్ హెచ్ ఓ కు అప్పగించడమైనది.

Leave A Reply

Your email address will not be published.