Take a fresh look at your lifestyle.

బోధన్ సీఐపై చర్య తీసుకోవాలి లేనిచో సీపీకి ఫిర్యాదు చేస్తాను….

0

బోధన్ సీఐపై చర్య తీసుకోవాలి లేనిచో సీపీకి ఫిర్యాదు చేస్తాను

ఎడపల్లి, ఫిబ్రవరి 14  ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం లోని జాన్కంపేట్ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం నిర్వహించిన చక్రతీర్థం లో బోధన్ రూలర్ సీఐ మహిళను లాఠీ తో కొట్టారు అనీ రెంజల్ మండలందూపల్లి గ్రామానికి చెందిన భోయీ భాగ్య అనే మహిళ ఆరోపించింది బ్రహ్మోత్సవాలకు తన కుమారుడితో వచ్చి జాతరలో ఆటవస్తులు కొనేందుకు వెళ్ళగా పరుసు కనబడక పోయేసరికి అక్కడే బందోబస్తునిర్వహిస్తున్న సిఐకి ఫిర్యాదు చేయడానికి వెళితే తన ఇష్టం వచ్చినట్లు దుర్బాలాడుతూ లాఠి తో ఒళ్ళు పలికేల అందరూ చూస్తుండగా ఓ మహిళను లాఠి తో కొట్టడం జరిగింది శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర కోసం వెళ్ళిన తనను బోధన్ రూలర్ విజయ్ బాబు బూతులు తిడుతూ తన దగ్గర ఉన్న లాఠి తో కాళ్ల పైన నడుము భాగంలో ఎక్కడపడితే అక్కడ వాతలు వచ్చేలాగా కొట్టారని మహిళ రోదిస్తూ తెలిపింది ఉన్నత అధికారులు స్పందించి దౌర్జన్యంగా తనపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది శుక్రవారం కుటుంబ సభ్యులతో వచ్చి ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తనకు న్యాయం జరగకపోతే సీపీకి ఫిర్యాదు చేసానని మహిళా తెలిపారు ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపడతానని ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు

Leave A Reply

Your email address will not be published.