Take a fresh look at your lifestyle.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం సై….

0

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం సై

ఎడపల్లి, అక్టోబర్ 06 (  లోకంతీరు ) :            త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల పోటీల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారని ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లాలోని ఆయా మండలాల పార్టీ నేతలు పాల్గొన్నట్లు ఎడపల్లి మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు రహీం అలీ తెలిపారు. హైదరాబాదులో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నట్లు ఆయన పేర్కొన్నారు. మలక్పేట ఎమ్మెల్యే, నిజాంబాద్ జిల్లా ఇన్చార్జి అహ్మద్ బ లాలను కలిసి జడ్ టిసి, ఎంపిటిసి స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు పై సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఎడపల్లి మండలంలో జరగనున్న ప్రాదేశిక, స్థానిక సర్పంచ్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు రంగంలో ఉంటారని ఆయన తెలిపారు.ఎన్నికల సమయంలో ప్రచారానికి ఎంఐఎ పార్టీ అధినేత అసౌద్దీన్ ఓవైసీ ఎడపల్లి మండలానికి రానున్నట్లు రహీమ్ ఆలీ ఎంఐఎం పార్టీ పెద్దలు యువకులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.