Take a fresh look at your lifestyle.

ఏఆర్ పి క్యాంప్ లో జాతీయ ఉపాధి హామీ పథకం….

0

ఏఆర్ పి క్యాంప్ లో జాతీయ ఉపాధి హామీ పథకం

ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) :  ఎడపల్లి మండలం ఏ ఆర్ పి క్యాంప్ గ్రామంలో మంగళవారం జాతీయ ఉపాధి హామీ పథకం శాఖ అధికారులు సిబ్బంది ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు ఈ కేవైసీ తో పాటు పనిపై అవగాహన సదస్సు నిర్వహించారు.జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక ఉపాధి హామీ కూలి తప్పకుండా ఫోటో దిగాల్సి ఉంటుందన్నారు.గతంలో కన్నా ప్రస్తుతం కంప్యూటర్లో కూలి పనులు చేసే ప్రతి ఒక్కరిని నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ పనులు జరిగే చోటనే కూలీలకు ఫోటో మ్యాచింగ్ తీయడం జరుగుతుందని ఈసీ శరత్ చంద్ర తో పాటు ఏపీఓ శ్రీవాణి తెలిపారు.ఉపాధి హామీ పనుల్లో పనిచేసే ప్రతి ఒక్క కూలికి ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. అవగాహన సదస్సులో ఎడపల్లి మండల ఏపీఓ శ్రీవాణి, టెక్నికల్ అసిస్టెంట్ జ్యోతి, క్షేత్రస్థాయి సిబ్బంది శంకర్, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.