బోధన్ పట్టణంలో రక్తదాన శిబిరం పోలీస్ అమరవీరులకు నివాళి
ఎడపల్లి, అక్టోబర్ 28 ( లోకంతీరు ) : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఏసీపి శ్రీనివాస్ హాజరై పోలీస్ సిబ్బంది యువకులు రక్తదానంలో పాల్గొని కార్యక్రమాన్ని ఏసీపి శ్రీనివాస్ అభినందించారు బోధన్ పట్టణ యువకులు ఉత్సాహంగా స్పందించి పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ బోధన్ డివిజన్ రూలర్ సీఐ విజయ్ బాబు ఎస్సైలు మచ్చేందర్ రెడ్డి సునీల్ హబీబ్ మహేష్ ముత్యాల రామ చంద్రమోహన్ తో పాటు గ్రామ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు యువకులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు రక్తదాన శిబిరం స్ఫూర్తిదాయకంగా సాగి పోలీస్ విభాగం సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ముందుంటుందని తెలిపారు.