ఎన్సిసి ఏ.టి.సి.క్యాంప్ జానకంపేట్ సందర్శించిన డి.డి.జి
ఎడపల్లి, అక్టోబర్ 30 ( లోకంతీరు ) : నిజామాబాద్ జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో 12 తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి ఆధ్వర్యంలో ఎన్సిసి ఏ.టి.సి. క్యాంప్ బుధవారం ప్రారంభమయినది. నవంబర్ 7శుక్రవారంవరకు జరిగే ఈ క్యాంపులో వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి మొత్తం సుమారు 600 ఎన్.సి.సి విద్యార్థులు జేడీ, జెడబ్ల్యూ, ఎస్.డి., ఎస్.డబ్ల్యు. ఏ.ఎన్.ఓ.లు, జేసివో, ఎన్సివో, హవల్దార్లు పాల్గొంటున్నారని,12 తెలంగాణ ఎన్.సి.సి. బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ప్రియాజిత్ సూర్ తెలిపారు. గురువారం ఏపీ& తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమెండోర్ నర్సింగ్ శైలాని క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా డి.డి.జి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి దేశానికి 100 సంవత్సరాలు 2047 నాటికి పూర్తి చేసుకోబోతోంది.వికసిత భారత్ కార్యక్రమాలలో భాగంగా అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో యువకులకు నైపుణ్యాలు,సాంకేతికత, ఉపాధి వంటి అనేక అంశాలలో అభివృద్ధి సాధించబోతుందనీ, అందుకు “ఐక్యత క్రమశిక్షణ” నినాదంతో సాగే ఎన్.సి.సి. కెడేట్స్ కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో 12 తెలంగాణ ఎన్.సి.సి. బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ప్రియాజిత్ సూర్, లెఫ్టినెంట్ కల్నల్ విష్ణు పి.నాయర్, సుబేదార్ మేజర్ రాచపాల్ సింగ్, ఏ.ఎన్.ఓ. లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, నాగేశ్వర్ రావు, శ్రీపాథ,బాబురావు, రాజేశ్వర్, నవీన్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.