జానకంపేట్ లో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్


ఎడపల్లి, అక్టోబర్ 30 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం జానకంపేట సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఆకస్మికంగా తనికి నిర్వహించారు. రైతుల పండించిన ధాన్యం రాశులు తడిసిపోయి ఉండడం పట్ల కలెక్టర్ ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు కొనుగోలు చేసి బైల్డ్ కొరకు రైస్ మిల్ కు పంపించాలనికొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.17% తేమ ఉన్న ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి రైస్ మిల్లుకు. పంపాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు పండించిన దాన్యం తడిసిపోయి ఉండడం పట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ గుర్తు చేశారు. రైతులతో కలెక్టర్ మాట్లాడి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కలెక్టర్ వెంట ఎడపల్లి తహసిల్దార్ దత్తాత్రేయ, ఎడపల్లి సహకార సంఘం అధ్యక్షులు పోలమల్కా రెడ్డి, సహకార సంఘాల కార్యదర్శులు రాజారాం, గంగారెడ్డి, సుభాష్, ఎడపల్లి ఐకెపి ఎపిఎం సుధాకర్, తోపాటు రైతులు తదితరులు ఉన్నారు.