Take a fresh look at your lifestyle.

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా…..

0

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఎడపల్లి, నవంబర్ 29 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలోని పరిగె సాయిలు, అనిత దంపతులు శనివారం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు నామినేషన్ దారఖాస్తులను స్వీకరించారు. పరిగె సాయిలు సతీమణి పరిగే అనిత ఎంపీటీసి ఉన్న సమయంలో కుర్నపల్లి  గ్రామాన్ని అభివృద్ధి చేశారు. ఈసారి సర్పంచ్ గా బిసి రావడంతో తాను సర్పంచ్ గా పోటీలో ఉన్నట్లు పరిగి సాయిలు తెలిపారు. గ్రామ పెద్దలు మహిళలు యువకులు ఒకసారి తనకు అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఆయన వెంట గాంధారి హనుమంత్ రెడ్డి, అనిల్ రెడ్డి, కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, రాములు, సాయి రెడ్డి, కొండ్ర సంజయ్, సుమన్, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.