Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండలంలో ఏకగ్రీవం దిశగా బాపునగర్…..

0

ఎడపల్లి మండలంలో ఏకగ్రీవం దిశగా బాపునగర్

–  సర్పంచ్ అభ్యర్థి నాగునూరి అనురాధ

ఎడపల్లి , నవంబర్ 29 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా, ఎస్సీ మహిళా సర్పంచ్ గా రావడంతో, అలాగే వార్డ్ సభ్యులకు కూడా కేటగిరి రావడంతో, తానాకాలన్ ఎన్నికల  నామినేషన్ కేంద్రంలో బాపునగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వార్డ్ సభ్యులు, నామినేషన్ దాకాలు  చేశారుచివరి రోజు కావడంతో  నామినేషన్ ప్రక్రియ  కొనసాగింది. బాపు నగర్ గ్రామానికి చెందిన సర్పంచులు గా అభ్యర్థుల తో పాటు వార్డు సభ్యుల్లో ఉన్న అభ్యర్థులు కూడా శనివారం చివరి  నామినేషన్ వేయడంతో ఇతరులు ఎవరు కూడా నామినేషన్ దాకా చేయకపోవడంతో, అటు వార్డు సభ్యులు, ఇటు సర్పంచ్ గా నాగునూరి అనురాధ రాజశేఖర్ ఏకగ్రీవంగా అయినట్టు అధికారికంగా, గ్రామసభ పూర్తి సమాచారం. ఏది ఏమైనప్పటికీఎడపల్లి మండలంలోని బాపునగర్ గ్రామంలో వార్డ్ సభ్యులతో పాటు సర్పంచ్ పోటీలు ఉన్న అభ్యర్థి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల బాపూనగర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు పూర్తి సమాచారం. ఈ సందర్భంగా సర్పంచ్ పోటీలో ఉన్న నాగునూరి అనురాధ రాజశేఖర్ మాట్లాడుతూ తనపై అభిమానంతో ఉన్న గ్రామస్తులు పోటీలు ఉన్న వార్డు సభ్యులు కూడా పోటీ పడకుండా  ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయానికి రావడం పట్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న నాగునూరి అనురాధ రాజశేఖర్ గ్రామస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఏది ఏమైనాపటికి ఎడపల్లి మండలంలోని బాపూనగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వక్తం చేస్తున్నారు. అధికారికంగా ఈనెల 11 వ తారీఖున ఎన్నికల అధికారులు సర్పంచ్ , నుండి ఉపసర్పంచ్ తో పాటు వార్డు సభ్యుల వివరాలను వెల్లడించి అధికారికంగా నియమక పత్రాలను అందించాల్సి ఉంటుంది. ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తో పాటు వార్డ్ సభ్యులు ఏకగ్రీవం కావడం పట్ల ఎడపల్లి మండల వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.