Take a fresh look at your lifestyle.

42 వ డివిజన్ ఆమ్ ఆద్మీ విస్తృత ప్రచారం……

0

42 వ డివిజన్ ఆమ్ ఆద్మీ విస్తృత ప్రచారం……

ఒక్క అవకాశం ఇవ్వండి..

అభివృద్ధి చేసి చూపిస్తా.

– సమీర్ అహ్మద్

నిజామాబాద్,  ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : 42 వ డివిజన్ లో లోకల్ అభ్యర్థిగా మీ ముందుకు ఆమ్ ఆద్మీ అభ్యర్థిగా వస్తున్నాను.ఒక్క అవకాశం కల్పించాలని సమీర్ అహ్మద్ ఓటర్ల ను కోరారు.శనివారం 42 వ డివిజన్ లో పెద్ద ఎత్తున ఇంటింటా ప్రచారం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే శాదీముభారక్ ఎత్తి వేసిందని అలాగే గత ఎన్నికల్లో 6 పథకాలు ఏ ఒక్కటి కూడా సంపూర్తిగా అమలు పరుచలేదని అన్నారు.నేను ఇదే డివిజన్ పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అధికారం లేనప్పుడే ఎన్నో పనులు చేశాను.ఈ ఎన్నికల్లో గెలిపిస్తే 42 వ డివిజన్ కు మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

Leave A Reply

Your email address will not be published.