Take a fresh look at your lifestyle.

ఎడపల్లి మండలంలో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు….

0

ఎడపల్లి మండలంలో అంగరంగ వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

ఎడపల్లి, సెప్టెంబర్ 24 ( లోకంతీరు ) :  ఏడపల్లి మండలంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఎడపల్లి, ఎడపల్లిలోని నయాబాది, మంగళ్ పహాడ్ ,కూర్నపల్లి, తానాకాలన్ ,జానకంపేట ,ఏఆర్పి క్యాంప్, అంభం (వై), జైతాపూర్, పోచారం, గ్రామాలలో దేవి ఉత్సా కమిటీ ఆధ్వర్యంలో దుర్గ దేవి ప్రతిమలను మండపాల నిర్వాహకులు ఉత్సాహ కమిటీ పెద్దలు యువకులు మహిళలు భక్తిశ్రద్ధలతో మండపాలలో (ప్రతిష్టాపన) అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే., నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఉత్సా కమిటీ నిర్వాహకులు గ్రామ పెద్దలు మహిళలు రోజు ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో భాగంగా ఉదయం సాయంకాలం కుంకుమార్చన భక్తిశ్రద్ధల పాటలతో మండపాలు నిండుగా భక్తులతో తలపిస్తున్నాయి. బుధవారం* దేవిని *అన్నపూర్ణ దేవిగా కొలిచారు.పూజల అనంతరం భక్తుల సౌకర్యం మేరకు మండపాల నిర్వహకులు మరికొన్ని గ్రామాలలోని మండపాల వద్ద అన్నదానం చేయడానికి గ్రామ యువకులు, పెద్దలు ముందుకు వస్తున్నారు.రోజువారిగా అమ్మవారికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఎడపల్లిలోనిదాస్ హనుమాన్మందిరం వద్ద.తాజా మాజీ ఎంపిటిసి నాయుడు స్రవంతి పోతన్న దంపతులు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి దాతగా ముందుకు వచ్చారు.చిన్నారులు, పెద్దలు మహిళల భక్తులు అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండలంలోని గ్రామాలలో ఏర్పాటు చేసిన దేవి మండపాలను ఏడపల్లి ఎస్సై ముత్యాల రమ, పోలీస్ సిబ్బంది రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను గ్రామస్తులు ఆనందంగా జరుపుకోవాలని ఎస్సై రమ గ్రామస్తులను కోరుతున్నారు. సమస్త్యాత్మక గ్రామాలలో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఆమె సైతం పర్యవేక్షణ జరుపుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.