Take a fresh look at your lifestyle.

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం….

0

బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

బైంసా, ఫిబ్రవరి 05 ( లోకంతీరు ) : బైంసా మండలం లోని కోతుల్ గాం గ్రామం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సంతోషం వ్యక్తం చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షురాలు సిరం సుష్మరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అదేశాల మేరకు ఈ కార్యక్రమన్ని చేపట్టడం జరిగిందన్నారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతరామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగ పడుతున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నరన్నారు.కాంగ్రెస్ నాయకులు కేంద్ర బడ్జెట్ పై తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదన్నారు.. సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపతి మర్ము ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు. బిజెపి పార్టీ మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్య ముస్తుందన్నారు.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షురాలు, సిరం సుష్మరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబెర్ భూమేష్ ను శాలువా తో సత్కరించారు.కార్యక్రమం లో బిజెపి మండల నాయకులు సాయి, మాజీ ఉపసర్పంచ్, బూత్ ఇంచార్జి లు తిరుపతి, లింగం, నాయకులు భోజరాం పటేల్, గ్రామస్తులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.