Take a fresh look at your lifestyle.

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి….

0

ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందించాలి

– సానుకూలంగా స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్. 

– హర్షం వ్యక్తం చేసిన ప్రెస్ క్లబ్ కార్యవర్గం.

నిజామాబాద్, జులై 14 ( లోకంతీరు న్యూస్ ) : అర్హులైన జర్నలిస్టు పిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో 100 శాతం ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, వాగ్మారే సుభాష్ లు కోరారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవల జిల్లాకు విచ్చేసిన విద్యా శాఖ కార్యదర్శి యోగితా యోగితా రాణ కు ఉచిత విద్య అందించాలని ప్రెస్ క్లబ్ కార్యవర్గం కలిసి విన్నవించారు . ఈ వినతిపై స్పందించిన ఆమె జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశించడం జరిగింది. కాగా సెలవు పై ఉన్న డీఈవో విధుల్లోకి వచ్చిన సందర్భంగా మంగళవారం ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఆధ్వర్యంలో కలిసి ఉచిత విద్యా అందించాలని విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ స్పందిస్తూ.. ఒకటి రెండు రోజుల్లో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య అందేలా చూస్తానని, ఇతర జిల్లాలలో ఉన్న ప్రొసీడింగ్ ను పరిశీలించి నిజామాబాద్ జిల్లాలో కూడా ఉచిత విద్య అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సతీష్, కమిటీ సభ్యులు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.