Take a fresh look at your lifestyle.

జానకంపేట్ ప్రయాణ ప్రాంగణం పై ఆర్టీసీ అధికారులు దృష్టి పెట్టాలి…..

0

ఆర్టిసి అధికారులు ఎడపల్లి జానకంపేట్ ప్రయాణ ప్రాంగణంపై దృష్టి పెట్టాలని ప్రయాణికుల ఆవేదన

ఎడపల్లి, అక్టోబర్ 07 ( లోకంతీరు ) :  బోధన్, నిజామాబాద్, వయా జానకంపేట మీదుగా బాసర పట్టణ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన బోధన్, నిజామాబాద్ జానకంపేట్ గ్రామ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుతం పశువుల పాకగా తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో పారిశుధ్య లోపం, మరమ్మత్తుల లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది ప్రతి రోజు వందలాది మంది ప్రయాణికులు ఈ ప్రాంగణాన్ని ఉపయోగించాల్సి  వుంది, కానీ,  మరుగుదొడ్లు లేకపోవడం, నీటి సౌకర్యం లేకపోవడం, ఆర్టీసీ సిబ్బంది గైర్హాజరు వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ప్రయాణికులు అసౌకర్యానికిలోనై ఈ ప్రాంగణాన్ని వదిలి గ్రామ ప్రధాన కూడలి అయిన శివాజీ చౌరస్తా వద్ద బస్సుల కోసం వేచి ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగి, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిన ఈ ప్రాంగణం స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. జానకంపేటలోని ప్రధాన కూడలిలో ఉన్న మహాత్మా గాంధీ శివాజీ చౌరస్తానే ఇటుగా బోధన్, అటు నిజమాబాద్, వయా జానకంపేట మీదుగా బాసర పట్టణానికి ప్రయాణికులు వెళ్తుంటారు. ప్రధాన కూడలిలో చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వర్షంలో తడుస్తూ ఎండతో ఇబ్బంది పడుతు సరైన సదుపాయాలు లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం వలన ఆవాహనదారులు లబ్ది పొందుతున్నారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, “ప్రయాణ ప్రాంగణం కోసం మా పూర్వికులు కేటాయించిన స్థలం ఈరోజు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది అని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే, మేమే గ్రామ అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం”అనిహెచ్చరిస్తున్నారు.ప్రభుత్వం మహిళ ప్రయాణికులకు ఉచిత ప్రయాణం అందించడం మంచి విషయం కానీ, ప్రయాణికులకు సరైన సౌకర్యాలు ప్రాంగణా శుభ్రత, సురక్షితతోఉన్నతంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.ఇకనైనా జానకంపేట్ ప్రయాణ ప్రాంగణంలో సంబంధిత అధికారులు తక్షణ పారిశుధ్య చర్యలు చేపట్టి మరుగుదొడ్లు, లైటింగ్, నీటి వసతులు కల్పించాలి అని,ఆర్టీసీ సిబ్బందిని నియమించి, ప్రయాణికులకు సమాచారం అందించే సౌకర్యం కల్పించాలనీ గ్రామస్తులు టి ఎస్ ఆర్ టి సి అధికారులను కోరుతున్నారు..

Leave A Reply

Your email address will not be published.