Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి…..

0

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి 

మిట్టపల్లి పేరెంట్స్ మీటింగ్‌లో  పాల్గొన్న  ఆమ్ ఆద్మీ పార్టీ షేక్ జుబేద్ హైమద్   

నిజామాబాద్  / డిచిపల్లి, జులై 13 ( లోకంతీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిజామాబాద్ రూరల్ కాంసెన్సీ ఇన్‌చార్జ్ షేక్ జుబేద్ హైమద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ విద్య పట్ల నిర్లక్ష్యం చూపడం సరైంది కాదు అన్నారు . ప్రైవేట్ పాఠశాలలకు అధిక ఫీజులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా, ప్రైవేట్ ఉద్యోగాలను మాత్రం నిరాకరించడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేసి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ ఇన్‌చార్జ్ సునీల్ శ్రీధర్, డి. పోశెట్టి, రామానుజాచారి, సూర్యకాంత్, పి. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ప్రతిభను గుర్తిస్తూ, నైన్త్ క్లాస్‌లో ఫస్ట్ స్థానంలో నిలిచిన శ్రీజ, సెకండ్ స్థానంలో విష్ణువర్ధన్, ఎయిత్ క్లాస్‌లో ఫస్ట్ మనస్విని, సెకండ్ రాహుల్‌ను అభినందించారు. అలాగే ఈ పాఠశాల నుండి అంతరిక్ష పరిశోధన శాఖకు వెళ్లి వచ్చిన ఎయిత్ క్లాస్ విద్యార్థి రాహుల్, నైన్త్ క్లాస్ విద్యార్థి విష్ణువర్ధన్‌ను ప్రత్యేకంగా సత్కరించారు.ఈ సమావేశంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.