Take a fresh look at your lifestyle.

అసాంఘిక కార్యకారపాలకు అడ్డా….!ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయ ప్రాంగణం…

0

అసాంఘిక కార్యకారపాలకు అడ్డా….!

  • బడులు బెల్ట్ లు అయ్యాయి.
  • ప్రభుత్వ విద్యాసంస్థల సముదాయ ప్రాంగణాలలో మందుబాబుల చిందులు.
  • పోలీస్ స్టేషన్ పక్కనే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగ మారటం గమనార్హం.
  • ఆందోళన చెందుతున్న ఉపాధ్యాయలు,అధ్యాప కులు,ప్రజలు.
  • రాత్రివేళ నిఘా ఏర్పాటు చేయాలని పలువురు వెల్లడి.

 

   

బాన్సువాడ/కోటగిరి, ఫిబ్రవరి 06 ( లోకం తీరు ) : కోటగిరి మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రైమరీ,ఉన్నత పాఠశాల,కళాశాల,మండల విద్యా వనరుల కేంద్రం,పల్లె ప్రకృతి వనం ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారి బెల్టు షాపులుగా మారుతున్నాయి.రాత్రీ వేళ ఈ విద్యా సంస్థల సముదాయాల ఆవరణంలో మందుబాబులు మద్యం సేవించడానికి అనువు గా ఎంచుకొని విచ్చలవిడిగా మద్యం తాగి సీసాలను అక్కడ నే వదిలి వేయడం,మద్యం సీసాలను పగలగొట్టడం వంటి చేష్టలను చేస్తున్నారు.అలాగే ఈ సముదాయాల ప్రాంగణాల లో గుట్కాలు తిని ఉమ్మి వేసి నటువంటి దృశ్యాలు చూస్తే హీనాతి హీనంగా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఈ ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణంలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగ మారటం గమనార్హం. పంచాయతీ అధికారులు, ప్రభుత్వ పాఠశాల,కళాశాల, ఎస్సీ,బీసీ సంక్షేమ బాలుర హాస్టల్,మండల విద్యా వనరుల కార్యాలయ యాజమాన్యం,పోలీసు వారు పట్టించుకోకపోవడంతో ఆకతాయిలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

ఆకతాయిలకు అడ్డా…..

కోటగిరి ప్రభుత్వ ప్రైమరీ, ఉన్నత పాఠశాల,కళాశాల, ఎస్సీ,బీసీ సంక్షేమ బాలుర హాస్టల్,మండల విద్యా వనరుల కార్యాలయాల ప్రాంగణాలలో సెలవు రోజుల్లో కొందరు పగటి సమయంలోనే చెడు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.ఈ ప్రభుత్వ సముదాయాలకు వెళ్ళే మేన్ గేటును గతంలో కొందరు ఆకతాయిలు విరగొట్టడంతో ఈ ప్రభుత్వ సముదాయాలకు వెళ్ళే ముఖ ద్వారం వద్ద ఉండాల్సిన మేన్ గేట్ లేక, అందులో వాచ్ మేన్ లేక పోవడం వంటి కారణాల వల్ల ఈ ప్రభుత్వ సముదాయాలలో ఆకతాయిల అరాచకాలకు నిలయంగా మారింది.

మేన్ గేట్ ఏర్పాటు చేసి వాచ్ మేన్ నియమించాలి.

ప్రభుత్వ ప్రైమరీ,ఉన్నత పాఠశాల,కళాశాల,బీసీ,ఎస్సీ బాలుర వసతి గృహం,మండల విద్యాశాఖ కార్యాలయం,పల్లె ప్రకృతి వనం వంటి ప్రభుత్వ సముదాయంలో వేలాది మంది విద్యార్థులు,వందలాదిమంది ఉపాధ్యాయులు,పదుల సంఖ్యలో అధ్యాపకులు వారి వారి విధి నిర్వహణలు నిర్వహిస్తారు.ఒకే చోట ఏర్పాటు చేసినటువంటి ఈ ఆరు ప్రభుత్వ కార్యాలయాల కు ఓక వాచ్మెన్ గాని గ్రామ పంచాయతీ సిబ్బంది గానీ లేకపోవడంతో ఈ సముదా యం అసాంఘిక కార్యకలాపా లకు అడ్డాగా తయారైంది. సాయంత్రం వేళ గ్రామానికి చెందిన ప్రజలు పల్లె ప్రకృతి వనంలో సేద తీరడానికి వచ్చినప్పుడు మందు సీసాలు,పారేసిన గుట్కా, సిగరెట్ ప్యాకెట్లు విద్యాలయాల ప్రాంగణాలలో దర్శనం ఇవ్వడంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నా రు.ప్రభుత్వ విద్యా సముదా యాల ముఖ ద్వారాన మెయిన్ గేట్ ను ఏర్పాటు చేసి ఒక వాచ్మెన్ గానీ గ్రామపంచాయతీ సిబ్బందితో రాత్రివేళ నిఘాను ఏర్పాటు చేస్తే ఇలాంటివి జరగ కుండా ఉంటాయని స్థానికులు కోరుతున్నారు.ఆయా విద్యా సంస్థల అధికారులు,స్థానిక గ్రామ పంచాయతీ సిబ్బంది, పోలీస్ శాఖ వారు స్పందించి ఇలాంటి ఆకృత్యాలు మరో మారు దర్శనమివ్వకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.