ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం
– సాలూర ప్రాథమిక వైద్యులు డాక్టర్ రాజకుమార్

ఎడపల్లి, నవంబర్ 17 ( లోకంతీరు ) : గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగానే ఉంటారని వైద్యులు రాజ్ కుమార్ అన్నారు.సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 33 మంది గర్భిణి స్త్రీలు ఈ కార్యక్రమంలో పాల్గొనగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ స్కోర్స్ 100 ఎంఎల్ ఎన్ఎస్ లో ద్వారా ఎక్కించడంజరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళలు గర్భిణీగాగుర్తించినతర్వాత అవసరం ఉన్నప్పుడు సంబంధిత ఏఎన్ఎం లను ఆశ వర్కర్లకు అందుబాటులో ఉండి ఆరోగ్య పరీక్షలను నిర్వహించు కోవాలన్నారు.అలాగే ఆకుకూరలు పౌష్టికమైన భోజనాన్ని తీసుకోవాలన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పులు నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. గర్భిణీ మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారంతో పాటుఆకు,కాయగూరలు తప్పనిసరిగా వాడాలన్నారు. అత్యవసర సమయంలో వైద్యులను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు రాజ్ కుమార్, శ్రీకాంత్, ఫార్మసిస్ట్ రమణ, సూపర్వైజర్ సత్యం, సాయి కుమారి, ఎంఎల్ హెచ్పి, పవన్, శేఖర్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, రాంబాబు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.