Take a fresh look at your lifestyle.

భారత్ బంద్ ను విజయవంతం చేయాలి…

0

భారత్ బంద్ ను విజయవంతం చేయాలి

కామారెడ్డి జిల్లా,అగస్టు 20 (లోకంతీరు) : సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 21న వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ విజయవంతం చేయాలని డిమాండ్ మాల మహానాడు పిలుపునిచ్చారు. ఇన్ని రోజులు అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి ఉన్న మాల, మాదిగల మధ్య విభజించు పాలించు అనే నినాదంతో వర్గీకరణను బిజెపి ప్రభుత్వం తెరపైకి తేవడం జరిగిందన్నారు. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీన ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం కల్పించడానికి కామారెడ్డి జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీలు ఎడ్ల రాజు, సూతారి సుధాకర్ లు మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిజెపి బహుజన వర్గాలకు రాజ్యాధికారం వస్తే మాటలు సాగవనే ఉద్దేశంతో వర్గీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జిలతో తీర్పును ఇచ్చారు. ఈ తీర్పు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నందువల్ల అన్ని రాష్ట్రాల్లోని మాలలు, మాల ఉపకులాలు నష్టపోతున్నారు. మాలలు మాలో ఉపకలాలకు జనాభా లెక్కించి వారికి జనాభా, ధామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి డిమాండ్ చేస్తున్నామన్నారు. లేనిపక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మాలలు మాల ఉపకులాలు కలిసి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. దీనిని వెంటనే గమనించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోవాలన్నారు. నేడు జరిగే ఆగస్టు 21 తారీఖున వర్తక వాణిజ్య, బార్ అసోసియేషన్, విద్యాసంస్థలు, బార్ అండ్ రెస్టారెంట్లు, హోటల్లు, ఫార్మా అండ్ డ్రగ్స్ ఏజన్సీలు, ఆర్టీసీ యాజమన్యం, ఆటో యూనియన్, సామాన్య ప్రజలు అందరు కలిసి భారత్ బంద్ కు మద్దతు ఇచ్చి బంద్ విజయవంతం చేయలన్నారు. ఈ కార్యక్రమంలో మాల, మాల ఉపకులాలు అధిక సంఖ్యలో పాల్గొని భారత్ బంద్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ మీసాల సత్యం, జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, కో కన్వీనర్ సంగి రాజలింగం, మీసాల భూపతి, రాజు, సుతారి భూమేష్, మీసాల శంకర్, ఎడ్ల భాను, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.