రాజకీయాల్లో రౌడీ ఇజం పనికి రాదు…
బిఆర్ఎస్ పార్టీ సిద్దిపేట నాయకులు హెచ్చరిక…
- సిద్దిపేట ను చీప్ గా మాట్లాడే చిల్లర గాళ్ళను సహించదు..
ప్రశాంతంగా ఉండే సిద్దిపేట లో ఫ్యాక్షనిస్ట్ లా ప్రవర్తిస్తానంటే కుదరదు… - ఎన్నికల్లో పోటీ చేయి.. గెలువు కానీ ఈ గెలుపుకు కయ్యం పెట్టుకునే రాజకీయాలు బంద్ చేయి…
హరీష్ రావు ప్రోగ్రెస్ షీట్ ను నీ రౌడీ షీట్ చెరిపేయలేదు… - పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా...
- హరీష్ రావు ఇంటి మీదకే దాడి కి వస్తా అని హెచ్చరిస్తున్నావా…
రాజకీయం చేస్తున్నావా రౌడీ ఇజం చేస్తున్నావా… - మైనంపల్లి హనుమంతరావు బ్రాండ్ కాదు పెద్ద గుండా…

సిద్దిపేట, ఫిబ్రవరి 07 ( లోకంతీరు ) : మైనంపల్లి అంటేనే ఒక బ్రాండ్ అని గొప్పలు చెప్పుకుంటున్న హనుమంతరావు వాస్తవానికి ఒక పెద్ద గుండా అని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి మెరుగు మహేష్, రెడ్డి ప్రభాకర్ రెడ్డిలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మైనంపల్లి ఏ హోదాలో సిద్దిపేటలో పర్యటించారని అతనికి ఎలాంటి పదవులు లేవన్నారు. మైనంపల్లి హనుమంతరావు ఒక పెద్ద గుండా కాబట్టే మల్కాజిగిరి లో ప్రజలు కరువు కాల్చి వాత పెట్టారని అది గుర్తుంచుకోవాలని తెలిపారు… రాజకీయాల్లో రౌడీ ఇజం పనికి రాదన్నారు… సిద్దిపేట చీప్ గా మాట్లాడే చిల్లర గాళ్ళను సహించదని .. ప్రశాంతంగా ఉండే సిద్దిపేట లో ఫ్యాక్షనిస్ట్ లా ప్రవర్తిస్తానంటే ఇక్కడ్ కుదరదని హెచ్చరించారు.. ఎన్నికల్లో పోటీ చేయి.. గెలువు కానీ ఈ గెలికి కయ్యం పెట్టుకునే రాజకీయాలు బంద్ చేయన్నారు… నీ దగ్గర డబ్బులు ఉంటె ఉండనివ్వు.. హరీష్ రావు కు ప్రజల్లో ఉన్న అభిమానాన్ని నీ డబ్బులతో కొనలేవు..హరీష్ రావు గారి ప్రోగ్రెస్ షీట్ ను నీ రౌడీ షీట్ ఎన్నటికీ చెరిపేయలేదని చెప్పారు…. ప్రశాంతంగా ఉన్న హరీష్ రావు నియోజకవర్గానికి కిరాయి మనుషులతో వచ్చిన మైనం పల్లి అనే కాంగ్రెస్ నేత పిల్లి శాపాలు పెట్టి పోయారు.
పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా…
అప్పుడు కాళ్లు మొక్కిన చేతులతో కత్తులు దూస్తున్నాడు.. హరీష్ రావు గారి ఇంటి మీదకే దాడి కి వస్తా అని హెచ్చరిస్తున్నావా… రాజకీయం చేస్తున్నావా రౌడీ ఇజం చేస్తున్నావా అని తీవ్రంగా మండిపడ్డారు… మంగళవారం నాడు అసలు సిద్దిపేటకు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్లారో కాంగ్రెస్ పార్టీ నాయకులకే తెలియని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. క్రమశిక్షణకు మారుపేరు బిఆర్ఎస్ పార్టీ అని, మీలాగా గుండాయిజం చేసే నాయకులము కాదని మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున వస్తే సిద్ధిపేటలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తారేమో అనుకున్నామని అవేమీ చెప్పకుండానే వ్యక్తిగత విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పారు. నిత్యం 18 గంటలు ప్రజల క్షేత్రంలో తిరిగే గొప్ప నాయకుడు హరీశ్ రావు అని, ఆయన చేస్తున్న అభివృద్ధి రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసునన్నారు. హరీశ్ రావుపై వ్యాఖ్యలు చేస్తే, తానేదో పెద్ద నాయకుడిని అవుతానని ఆలోచించడం అవివేకమని తెలిపారు. మరోసారి మా నాయకుడు హరీశ్ రావు పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే సహించే లేదని, మళ్లీ ఇలాంటి వాఖ్యలు చేసేముందు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే హరీశ్ రావు పై దాడి చేస్తానని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వాస్తవానికి గత పదేళ్ళలో మీ నాయకులు, కార్యకర్తలపై మేము దాడులు చేశామా అని ప్రశ్నించారు. హైదరాబాద్ గుండా మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటకు వచ్చి ఇక్కడ అభద్రత భావాన్ని కల్పించేలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనాలోచిత, అవాస్తవ మాటలు కూడా మాట్లాడారని మండిపడ్డారు. కేటీఆర్ కు ఏమి తెలియదని అన్నప్పుడు గతంలో కేటీఆర్ కాలు ఎందుకు మొక్కవంటూ ప్రశ్నించారు. నిన్న జరిగిన సమావేశం ఒక కామెడీ షో లాగా ఉందని ఎద్దేవా చేశారు. హనుమంతరావు బెదిరింపులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడదని తెలిపారు. నిన్న జరిగిన సమావేశంలో భాగంగా రహదారిపై ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఫుట్బాల్ కోచ్ అక్బర్ నవాబ్ పై దాడి చేయడం పిరికిపంద చర్యగా భావిస్తున్నట్టు చెప్పారు. ఓసారి ఇలాంటి దాడులకు పాల్పడితే మాకు కూడా ప్రతి దాడులు చేయడం సులువేనని హెచ్చరించారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ వజీర్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు మోయిజ్, అక్బర్ నవాబ్, రెబల్ రమేష్, రజనీకాంత్ రెడ్డి, పెర్క మధు, శ్యామ్ యాదవ్, మహేష్, రాజు, స్వామి, సాయిచరణ్ గౌడ్, షాదుల్ తను పాల్గొన్నారు.