అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
నెహ్రూ నగర్ గ్రామాన్ని ఆదర్శగ్రామంగాతీర్చిదిద్దుతా

ఎడపల్లి, డిసెంబర్ 06 ( లోకంతీరు ) : ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నందున నన్ను ఆదరించి మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అజ్ మే రీ మీర్జా కాజా బేగ్ ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటా తిరుగుతూ ఉంగరం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి అజ్ మేరీ బేగం మీర్జా కాజాబేగ్, మాట్లాడారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో నెహ్రు నగర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా మన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ మినీ ఆసుపత్రి భవన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారిని గుర్తించి రేషన్ కార్డులు ఇప్పించేందుకు సుదర్శన్ రెడ్డిని కోరుతామన్నారు. అలాగే గ్రామంలో ప్రభుత్వ మినీ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు కూడా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ ఫలలు అర్హులకు అందేవిధంగా బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డిని కోరుతామన్నారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటు పడతమని వారన్నారు. గ్రామంలో అందరూ తమను ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుకే వేసి తనను గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అజ్ మేరీ బేగం మీర్జా కాజాబేగ్ కోరారు. ప్రచార కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ అమానుల్లా షరీఫ్, స్థానిక నాయకులు, వార్డు సభ్యుల అభ్యర్థులు, తదితరులు ఉన్నారు.