రోడ్డు ప్రమాదంలో బైక్ స్కిడ్ అయి వ్యక్తి మృతి……

ఆర్మూర్ , ఫిబ్రవరి 14 ( లోకం తీరు ) : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం వేంపల్లి నేషనల్ హైవే లొ బండారు శ్రీను తండ్రి వెంకటేశ్వర్లు, వయస్సు: 52 సంవత్సరాలు, కులం: వడియా-రాజులు, ఆయన తన కూతురి వద్దకు నిర్మల్ వెళ్లే మార్గమధ్యంలో వేంపల్లి వద్ద బైక్ పై నుండి పడి చనిపోవడం జరిగింది. ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా గత కొద్ది సంవత్సరాల నుండి తొలికొండలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు ఆయన మామిడిపల్లి, ఆర్మూర్ గ్రామాలలో మేస్త్రిగా పనిచేస్తూ జీవనోపాధి జీవిస్తున్నాడు. సంఘటన స్థలాన్ని ముప్కాల్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ భాస్కరాచారి సందర్శించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.